ETV Bharat / state

ప్రభుత్వం హెచ్చరికలు పట్టవా?... ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ ఆపవా?

author img

By

Published : May 22, 2021, 10:36 AM IST

కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నా.. ప్రైవేటు ఆసుపత్రులు వాటి దందాను ఆపడం లేదు. రోగుల అవసరాన్నే అదునుగా చేసుకొని లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నాయి. మరోవైపు కరోనా రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

corona
corona

ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా.. ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స పేరిట రోగుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.9 లక్షలు బిల్లు చెల్లించమని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించిన వైద్యశాఖ, విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. కైకలూరులోని కొవిడ్ ఆస్పత్రిని ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి ఎస్పీ రవీంద్రనాథ్ సందర్శించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ నిర్మాణానికి జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ వార్డును ఎంపీ సత్యవతి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్​గా గుర్తించాలని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

డబ్యూహెచ్​వో సాయం

కొవిడ్ రోగులకు చికిత్స నిమిత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ 100 ఆక్సిజన్ కాన్స్‌న్‌ట్రేటర్లు అందజేసిందని కొవిడ్ ప్రత్యేక అధికారి అర్జా శ్రీకాంత్‌ తెలిపారు. డబ్యూహెచ్​వో ఇచ్చే మరో వంద కాన్సన్‌ట్రేటర్లను అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న 300 పడకల కొవిడ్ కేర్‌ సెంటర్‌లో వినియోగిస్తామన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని కొవిడ్‌ కేర్ సెంటర్‌కు రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా మందులు, వైద్య పరికరాలు అందజేశారు. గుంటూరు జిల్లా గొళ్లపాడులోని రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి చేస్తున్న సేఫ్ ఫార్మా సంస్థను ఎంపీ లావు కృష్ణదేవరాయలు సందర్శించారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు తయారీ విధానంపై చర్చించారు.

ఇదీ చదవండి:

సీఎంకు నాట్కో ఫార్మా లేఖ: 'లక్ష మందికి ఉచితంగా మందులు ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.