విజయవాడ నగరంలోని సింగ్‌నగర్ డంపింగ్ యార్డును మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు పరిశీలించారు. పేరుకుపోయిన చెత్తతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేరుకుపోయిన చెత్తను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తొలగించామని గుర్తుచేశారు. 90 శాతం డంపింగ్ యార్డు ఖాళీ చేయించి స్థానిక ప్రజలకు ఊరట కలిగించామని చెప్పారు. సమస్యపై స్థానిక ఎమ్మెల్యే స్పందించకుంటే... ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...