గత ప్రభుత్వంలో ఇసుక విధానం సరిగా లేదన్న వైకాపా... నేడు అదే విధానాన్ని అవలంబిస్తోందని మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు. ఇసుక పంపిణీ ఆపడం కారణంగా... నిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు. వేల నిర్మాణ కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉన్నందునా... ఇసుక పంపిణీనీ పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలుంటే... వాటిని సవరించాలని కోరారు. భాజపా రాష్ట్ర నేత మాణిక్యాలరావు సమక్షంలో కృష్ణా జిల్లాకు చెందిన పలువురు పార్టీలో చేరారు. విజయవాడ గొల్లపూడి భాజపా కార్యాలయంలో కాషాయ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మైలవరం నియోజకవర్గ పరిధిలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
ఇదీ చదవండీ...