రైతుల పొలాల్లో ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అమర్చడం హేయమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా జీ. కొండూరు మండల పరిధిలో పర్యటించారు.
మండలంలోని చేగిరెడ్డిపాడులో పంటపొలాలు సందర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: