కరోనా లక్షణాలున్న ప్రతివారికి పరీక్షలు చేయాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వారికి వెంటనే టెస్టులు నిర్వహించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్ట్ ల్యాబ్ ను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిశీలించారు.
కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై వైద్యులతో చర్చించారు. వైరస్ వ్యాప్తి నివారణకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కొవిడ్ పరీక్షల నిర్వహణకు కావాలసిన పరికరాలను అందుబాటులో ఉంచుకొవాలని సూచించారు. జగ్గయ్యపేటలో ఇప్పటికే కరోనా కేసులు 50కి చేరువలో ఉండటంతో పరీక్షలు నిర్వహించే వాహనాన్ని వరుసగా రెండో రోజు కూడా ఆయన ఏర్పాటు చేయించారు.
ఆదివారం డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో 290 మంది పరీక్షలు చేయించుకోగా సోమవారం ఎన్ఎస్పి కాలనీలో ఏర్పాటు చేసిన వాహనం వద్ద ఉదయం నుండి జనం బారులు తీరారు.
ఇవీ చదవండి:
చెరువుల్లా ప్రభుత్వ ఇళ్ల స్థలాలు..లబోదిబోమంటున్న లబ్ధిదారులు