హీరో, హీరోయిన్లుగా అడవి శేష్, రెజీనా నటించిన చిత్రం ఎవరు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంపై చిత్ర యూనిట్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కథాంశంతో వచ్చిన "ఎవరు" చిత్రం ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి