- ప్రశ్న: కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యం పరంగా విజయవాడ రైల్వేస్టేషన్లో ఏ విధమైన చర్యలను తీసుకున్నారు?
న్యూదిల్లీ నుంచి చెన్నైకు, చెన్నై నుంచి న్యూదిల్లీకి వారానికి రెండురోజులకొకసారి రైళ్లతో మొత్తం నాలుగు రైళ్లు నడుస్తాయి. ఈ స్టేషన్ నుంచి సుమారుగా ప్రతిరోజు 300మంది ప్రయాణికులు వెళుతున్నారు.
- ప్రతి పదిహేనుమంది ప్రయాణికులకు ఒక టికెట్ కలెక్టర్‌ను కేటాయించాము.
- ఆరోగ్యసేతు యాప్ తప్పగా ఉండేలా చర్యలు తీసుకున్నాం
- థర్మల్ స్క్రీనింగ్, బ్యాగేజ్ స్క్రీనింగ్ చేస్తున్నాం
- ప్రయాణికులకు మాస్కులు, గ్లౌజులు వాడాలి.రెండు సార్లు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
- కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా మార్కింగే వేశాం.
- కోచ్‌లను రెండు సార్లు శానిటైజ్ చేస్తున్నాం.
- ప్రశ్న: రైల్వేస్టేషన్లో ఎక్కడెక్కడా మార్కింగ్ బాక్సులు వేస్తున్నారు. ?
ప్రయాణికులు రిపోర్టు చేసే ప్రాంతం, కోచ్ దగ్గరకి వెళ్లేటపుడు, విశ్రాంతిగదిలో, రైలు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ వేశాం.
- ప్రశ్న: ప్రత్యేక రైలులో ప్రయాణించాలంటే ప్రయాణికులు ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి..?
ఐఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. 22వ తేదీ వరకు వెయింటింగ్ లిస్ట్ ఇవ్వలేదు. 22 తేదీ తర్వాత వెయింటింగ్ లిస్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
- ప్రశ్న: స్టేషన్లో ప్రయాణికుల రద్దీని ఎలా పర్యవేక్షిస్తున్నారు..?
ప్రయాణికులు మూడు గంటల ముందుగానే రిపోర్టు చేయాలి. పది నిముషాల ముందే ప్లాట్‌ఫాం వద్దకు చేరుకోవాలి. రైలు వెళ్లగానే స్టేషన్ మూసేస్తున్నాం.
- ప్రశ్న: ప్రయాణికులు గమ్యస్థానంలో దిగగానే ఇంటికి వెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు..?
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారిని ఇంటికి చేర్చుతుంది. ఓ యాప్‌లో పేర్లను, జిల్లాలు నమోదు చేసి వారి చిరునామా ప్రకారం ఇంటికి చేర్చుతారు.
ఇదీచూడండి.
'వాళ్ల గురించి చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'