ETV Bharat / state

ఉద్యోగాలు పోతాయి... కానీ..!!

కరోనా ధాటికి దెబ్బతిన్న ఐటీ పరిశ్రమల్లో కొంతమేరకు ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని నాస్కామ్ మాజీ ఛైర్మన్, సీయెంట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహనరెడ్డి అన్నారు. కానీ దీనిపై ఆందోళన అవసరం లేదని కరోనా తర్వాత సాంకేతికత విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని చెబుతున్నారు. నూతన టెక్నాలజీలను నేర్చుకోవడంపై ఉద్యోగులు దృష్టి సారించాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కీలకంగా మారే అవకాశం ఉందని దీనికి తగిన సదుపాయాలు మన దగ్గర మెరుగుపడాల్సి ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పరిశ్రమకు నేరుగా లబ్ది చేకూర్చలేదని మోహనరెడ్డి అన్నారు. అమెరికా, చైనాలో మాదిరిగా ఉద్యోగులకు జీతాలు చెల్లించే.. పే రోల్ ప్రొటెక్షన్ విధానం అమలు చేసి ఉంటే పరిశ్రమలు మరింత కోలుకుని ఉండేవని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమపై కరోనా ప్రభావం, కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ తదితర అంశాలపై ఆయన ఈటీవీ భారత్​తో ఆన్​లైన్​లో మాట్లాడారు.

cyient executive chairman bvr mohanareddy interview
సీయెంట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహనరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : May 20, 2020, 8:38 AM IST

సీయెంట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహనరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఈటీవీ భారత్ : కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. 20లక్షల కోట్లు ఇస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు మంచి స్పందన వచ్చింది. నిర్మలా సీతారామన్ ఐదు రోజులు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆ ఉత్సాహం నీరుగారిపోయింది. ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా దీనిపై మీ స్పందన ఏంటి..?

బీవీఆర్: ఉద్దీపన ప్యాకేజీ జీడీపీలో 10శాతం ఉంటుందని చెప్పారు.. కానీ నగదు రూపంలో జరిగిన లబ్ది తక్కువ. రాష్ట్రాలకు, వివిధ రంగాలకు అందిన మొత్తాన్ని లెక్కిస్తే 1.5శాతం నుంచి 1.7శాతం వరకూ ఉండొచ్చని లెక్కవేశారు. దాంతో పరిశ్రమ నిరుత్సాహపడింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో పారిశ్రామికరంగం దెబ్బతింది. కానీ ఆ దేశాల్లో పరిశ్రమలను నేరుగా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనాల్లో ప్యాకేజీ బాగుంది. అక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో మూడు నెలల ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వాలే భర్తీ చేశాయి. మన దగ్గర నేరుగా లబ్ది చేకూరకపోవడంతో పరిశ్రమవర్గాలు నిరుత్సాహపడ్డాయి

ఈటీవీ భారత్ : జీడీపీలో దాదాపు 8 శాతం భాగస్వామ్యం, 15లక్షల కోట్ల టర్నోవర్, దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యవస్థ, అత్యధికంగా విదేశీ నిధులు రాబడుతున్న పరిశ్రమ.. ఇన్ని ప్రాధాన్యతలున్నా.. ఎకనామిక్ ప్యాకేజ్ లో ఐటీ పరిశ్రమకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేదు.. దీనిపై మీరేమంటారు..?

బీవీఆర్: ప్యాకేజీలో ఏ పరిశ్రమపైనా దృష్టి పెట్టలేదు. ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు మాత్రమే ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఐటీ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తప్పకుండా చేసి ఉండాల్సింది. ఐటీ పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 70శాతం ఎగుమతుల ద్వారానే వస్తుంది. ఐటీ విషయంలో డిమాండ్, సప్లయ్ రెండూ దెబ్బతిన్నాయి. డిమాండ్ ఉన్న దేశాల్లో కరోనా విజృంభించింది. సేవల సప్లయ్ విషయంలోనూ సమస్యలున్నాయి. కాబట్టి ఐటీ పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది.

ఈటీవీ భారత్ : లాక్ డౌన్ పరిస్థితుల్లో ఐటీ పరిశ్రమ... ప్రభుత్వం నుంచి ఏం ఆశించింది..?

బీవీఆర్: సులభతర వాణిజ్యం మెరుగవ్వాలని కోరాం. అలాగే కార్మిక చట్టాలను కొంచెం సడలించాలి. పన్నులకు సంబంధించిన సమస్య ఉంది. మాకు సేవా పన్ను ఉంటుంది. ఇవన్నీ ఎగుమతులు కాబట్టి.. సేవాపన్నును మేము ప్రభుత్వం వద్ద క్లెయిమ్ చేసుకోవాలి. ఆ మొత్తం రావడానికి సమయం పడుతోంది. ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. దీనికి డైనమిక్ ఐపీలు అవసరం అవుతాయి. వీటిని జూలై 31వరకూ అనుమతిచ్చారు. వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ ఇవ్వమని చెబుతున్నాం.

ఈటీవీ భారత్ : ఐటీ పరిశ్రమ వినతులను ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా.. ?

బీవీఆర్: కొన్నింటిని పట్టించుకున్నారు. ఓఎస్పీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలంటే.. కోటి రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండేది. దానిని తీసేశారు. చిన్న ఐటీ కంపెనీలు, స్టార్టప్​లలో మూడు నెలలు ఆదాయం లేకపోతే వాళ్లు వేతనాలు ఎలా చెల్లించగలరు..!? ఇక్కడ ఎంతమందికి వేతనాలు చెల్లించాలనే దానిపై నిబంధనలున్నాయి. ఆ తర్వాత వాటిని కాస్త సడలించారు. కానీ ముఖ్యమైన విషయాలను వదిలేసి చిన్న చిన్న విషయాలను పరిష్కరించారు. కానీ చిన్న ఐటీ కంపెనీల్లో మూడు నెలల వేతనాలకు భరోసా ఇచ్చి ఉంటే.. మంచి వెసులుబాటు దక్కేది.

ఈటీవీ భారత్ : కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిజంగా గట్టెక్కించలుగుతుందా..?

బీవీఆర్: చాలా కష్టం. కానీ ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. భారత్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాలో మాదిరిగా రెండు, మూడు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీలు ఇక్కడ ఇవ్వలేరు. ఇలా ఖర్చు చేస్తే.. భారీ ఆర్థికలోటు ఏర్పడుతుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని సవాళ్లు తప్పవు.

ఈటీవీ భారత్ : చాలా మంది.. ఆర్థిక వేత్తలు, రాజకీయ వేత్తలు ఈ ఎకనామిక్ ప్యాకేజీని ఒక భ్రమ అని కొట్టిపడేస్తున్నారు..ఇంత డబ్బు ప్రకటించారు కానీ.. అదంతా ప్రజలకు, పరిశ్రమకు చేరదు అంటున్నారు. ఎంత వరకూ నిజం?

బీవీఆర్: తప్పకుండా ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి. స్తంభించిపోయిన ఆర్థికవ్యవస్థను కదిలించాలి. డిమాండ్ వైపు కదిలించగలగాలి. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే అది జరుగుద్ది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్​లో కొంత ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఆ డబ్బు మార్కెట్​లోకి తీసుకురావాలన్నది ప్రయత్నం. కానీ.. పీఎఫ్ అనేది పొదుపు. ఆ డబ్బును ఖర్చుచేయడం సమంజసం కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నగదు దాచుకోవాలనే ప్రయత్నిస్తారు. ఎవరూ ఖర్చు చేయరు. దీనికి బదులుగా ప్రజలకు నేరుగా నగదు అందిస్తే బాగుండేది.

ఈటీవీ భారత్ : ఆధునిక చరిత్రలోనే ఈస్థాయిలో నష్టం ఇంతకు ముందు జరగలేదు. భారత దృష్టికోణంలో ఆర్థికంగా కానీ... సామాజికంగా కానీ మనం ఏ స్థాయిలో దెబ్బతిన్నాం..?

బీవీఆర్: చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు దారుణమైన వివక్షకు, అవమానానికి గురయ్యారు. వారి విషయంలో అంతకన్నా తక్కువ పదాన్ని వాడలేం. అది చాలా బాధాకరం. పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఆతిథ్య రంగం, పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతిన్నాయి. వైద్యరంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. అమెరికాలోనే పదిశాతం మంది వైద్యులు ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని పరిశ్రమలు పురోగమించాయి. ఈ కామర్స్ వృద్ధి చెందింది. విద్యారంగంలో ఈ లెర్నింగ్ వస్తోంది. సాంకేతిక పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. 5జీ సాంకేతికత వస్తే.. విదేశీ వైద్యుల సూచనలతో నేరుగా ఆపరేషన్లు చేయొచ్చు. 1932లో వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం తర్వాత ఆటోమొబైల్, విద్యుత్ ఆధారిత పరిశ్రమల్లో వృద్ధి వచ్చింది. ఇప్పుడు కూడా 2020 తర్వాత సాంకేతికతపై ఆధారపడే పరిశ్రమల్లో వృద్ధి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈటీవీ భారత్ : లాక్​డౌన్ టైమ్​లో ఐటీ కంపెనీలు పూర్తి సామర్థ్యంతో పని చేయగలిగాయా...?

బీవీఆర్: పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోయారు. ప్రకృతి విపత్తో, అనుకోని అవాంతరమో ఏర్పడితే ఏం చేయాలి అనే విషయంపై ఐటీ పరిశ్రమల్లో బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ ఉంటుంది. కానీ మేమొవ్వరం ఊహించనిది ఏంటి అంటే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరం బీసీపీలోకి వచ్చేశాం. వందశాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతారని అసలు ఊహించలేదు. మా సంస్థలో 15వేల మంది ఉద్యోగులు ఉంటే.. అందులో సగం మంది హైదరాబాద్ లో పనిచేస్తారు. వాళ్లందరికీ.. ఒకేసారి 5వేల లాప్ టాప్​లు కొనుగోలు చేసి ఇవ్వాల్సి వచ్చింది. మన దగ్గర ఉన్న వాతావరణం, పరిస్థితుల్లో ఇంటి నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం సాధ్యం కాదు. 90శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే.. ఉత్పత్తి 70శాతం మేరకు వస్తుంది. అంటే అది కేవలం జీతాలకు సరిపోతుంది. ఇక నిర్వహణ, మిగిలిన విషయాలు చూసుకుంటే.. లాభాలు పోవడమే కాదు... నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది.

ఈటీవీ భారత్ : మన ఐటీ పరిశ్రమకు ప్రధాన క్లయింట్లు యు.ఎస్, యూరోప్. కరోనాతో ఆ దేశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం మన మీద ఎలా ఉంది...?

బీవీఆర్: ఇది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. యూరోప్​లో మెట్రో రవాణ పుంజుకుంటోంది. ఏరోస్పేస్ కొంచెం నెమ్మదిగా ఉంది. టెలికాం రంగంలో డిమాండ్ ఉండొచ్చు అనుకుంటున్నాం. అన్ని రంగాల్లోనూ కొత్త సాంకేతికతతో అప్లికేషన్లు వస్తాయి.

ఈటీవీ భారత్ : దేశంలో నాలుగున్నర కోట్ల మంది ఐటీ ఉద్యోగులున్నారు. చదువుకున్న వారికి ఎక్కవగా ఉపాధి చూపుతున్న పరిశ్రమ ఇది.. ఇప్పటికే ఉద్యోగాలు చాలా పోతాయి అన్న ఆందోళన ఉంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు...?

బీవీఆర్: ఉద్యోగాల మీద ప్రభావం అంతగా ఉండదు.. అని నేను అబద్ధం చెప్పలేను. కొంతవరకూ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. . వినియోగదారుడు నుంచి డబ్బు వస్తేనే మేం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వగలం. ఉద్యోగులపై కొంత ఒత్తిడి ఉన్న మాట నిజం. అయితే దానిపై ఆందోళన అవసరం లేదు. వినియోగదారుడిని సంతృప్తి పరచడం ప్రధాన లక్ష్యం కావాలి. ఎన్నిగంటలు పనిచేశాం అన్నది కాకుండా ఎంత ఉత్పత్తి సాధించామన్నది చూసుకోవాలి. కొత్త నైపుణ్యాలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఈ మూడు విషయాలు పాటిస్తే సమస్య ఉండకపోవచ్చు.

ఈటీవీ భారత్ : ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఐటీ పరిశ్రమలోకి రిక్రూట్ అవుతున్నారు. ఇక ముందు కూడా రిక్రూట్​మెంట్ రేట్ అలాగే ఉండొచ్చా...?

బీవీఆర్: ఉండకపోవచ్చు. వచ్చే రెండు త్రైమాసికాల్లో రిక్రూట్​మెంట్ తగ్గుతుంది. పెద్ద సంస్థలన్నీ కూడా ఇప్పటి వరకూ ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని చెప్పాయి. కానీ చిన్న కంపెనీలు చేయగలుగుతాయా అన్నది ప్రశ్నార్థకమే.. ప్రభుత్వ ప్యాకేజీలో కూడా వారికి ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదు. కాబట్టి చిన్న కంపెనీలు చేయగలుగుతాయో లేదో సందేహమే..

ఈటీవీ భారత్ : ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవడానికి ఐటీ పరిశ్రమ అనుసరించబోతున్న వ్యూహం ఏంటి..?

బీవీఆర్: ప్రపంచంలో 52శాతం ఐటీ అవుట్ సోర్సింగ్ వాణిజ్యాన్ని భారత్ చేస్తోంది. మిగతా 48శాతంలో మెజార్టీ వాటా సంపాదించే అవకాశం మనకు ఉంది. భద్రతా కారణాల వల్ల కొన్ని అప్లికేషన్ల అభివృద్ధి మనకు ఇవ్వలేదు. సైబర్ భద్రత విషయంలో మనం భరోసా ఇవ్వగలిగితే ఇంకొన్ని అవకాశాలుంటాయి.

ఈటీవీ భారత్ : ప్రతి విపత్తులోనూ.. ఏదో ఒక సానుకూలత ఉంటుందంటారు. ఈ విపత్తు ఏ రకంగా అయినా మనకు మేలు చేసిందంటారా.. ? ఐటీ పరంగా ..?

బీవీఆర్: సాంకేతికతలో మార్పులు వస్తాయి. కొత్త అప్లికేషన్లు వస్తాయి. మనం ఊహించని మార్పులు వస్తాయి. ఈ కామర్స్ రంగంలో విపరీతమైన మార్పులు వస్తాయి. మెషీన్ లెర్నింగ్ ద్వారా మన ముఖకవళికలు గుర్తించి మనం కొనుగోలు చేస్తామా లేదా అని గుర్తించే అప్లికేషన్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కొత్త సాంకేతికతలను నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఇదీ చదవండి:

'ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థికంగా కొంత కోలుకుంటాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.