కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. క్వింటా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర 1750, గ్రేడ్ 1కు రూ.1837, కామన్ రకానికి రూ.1815 గా ప్రభుత్వం ధర నిర్ణయించిందని ఆయన వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని... ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా భౌతికదూరాన్ని పాటిస్తూ.. స్వీయ నిర్బంధం కొనసాగించి కరోనా మహమ్మారి వ్యాప్తిచెందకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి.