లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లా ముదినేపల్లిలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భముగా 50 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు కాళ్లు కడిగి శాలువాతో సత్కరించిన వైష్ణవి... అనంతరం బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నామని.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే తన ఉద్దేశ్యం అని వైష్ణవి తెలిపారు.
ఇదీ చదవండి