కృష్ణా జిల్లా మోపిదేవిలో సోమవారం ఉదయం నుంచి ఈపాస్ మిషన్లు పనిచేయడంలేదు. రేషన్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తూ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఉచిత రేషన్ బియ్యం కోసం వచ్చిన వారు ఎదురు చూస్తున్నారు. పల్లెల్లో కొందరు కూలీ పనులూ మానుకుని రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఉచిత రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: 'కృష్ణా జలాలు జగ్గయ్యపేటకు తీసుకురావాలి'