గోతులమయంగా మారిన నూజివీడు జాతీయ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని డీవైఎఫ్ఐ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు సరిగా లేకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్ఐ పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు నిజాముద్దీన్ అన్నారు.
గోతులు ఎక్కువగా ఉండడంవల్ల వాహనచోదకులు కింద పడి కాళ్లు చేతులు విరగొట్టుకున్న సందర్బాలున్నాయని గుర్తు చేశారు. వర్షాకాలంలో పైపుల రోడ్డు నుంచి కండ్రిక వరకు ఉన్న జాతీయ రహదారి చెరువును తలపిస్తోందన్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. లేకుంటే డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పారు.
చలానాలు కట్టించుకుంటారు... రోడ్డ మరమ్మత్తులు మాత్రం పట్టవు
వాహనచోదకుల వద్ద వేలకు వేలు చలానాలు వసూలు చేసేందుకు పెడుతున్న శ్రద్ధ రోడ్ల మరమ్మతులు మీద పెట్టాలని పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ అన్నారు. జగన్ పాదయాత్ర చేసి నేటికి మూడేళ్లు అవుతుందని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న నాయకులకు ఈ సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: