ఇదీ చూడండి:
కుక్క కాటుకు 'శునకాలయం'లో పూజలతో చికిత్స!
కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం - దసరా
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున అమ్మవారు దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైభవంగా జరిగిన నగరోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని పూజించారు. ఇంద్రకీలాద్రిపై వేద సభ నిర్వహించగా పండితులంతా వేద పారాయణం చేశారు.
కన్నుల పండువగా దేవి అమ్మవారి నగరోత్సవం, వేద పారాయణం
దసరా ఉత్సవాల్లోని 8వ రోజు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. దుర్గా దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం నిర్వహించిన నగరోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్త బృందాల కోలాటాల నడుమ నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవాల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 400 మంది వేద పండితులు దుర్గమ్మకు వేద పారాయణం చేశారు. ఏటా దసరా ఉత్సవాల్లో దుర్గాష్టమి నాడు వేద సభ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. వేద పారాయణం అనంతరం పండితులను ఘనంగా సత్కరించారు. వేద సభలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
కుక్క కాటుకు 'శునకాలయం'లో పూజలతో చికిత్స!
Intro:Body:
Conclusion:
indrakeeladri
Conclusion: