ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండితులతో ఘనంగా వేదసభ - విజయవాడ దుర్గ గుడి వార్తలు

ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండితులతో అత్యంత ఘనంగా వేదసభ నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళ నుంచి వేద సభ నిర్వహించి వేద పండితులను సత్కరించటం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎక్కువమంది వేద పండితులను తీసుకురాలేకపోయామని ఆలయ ఈఓ తెలిపారు.

durga temple
durga temple
author img

By

Published : Oct 25, 2020, 12:56 AM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండితులతో అత్యంత ఘనంగా వేదసభను మహా మండపం ఆరోవ అంతస్తులో నిర్వహించారు. ఈ సభలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజా శంకర్ పాల్గొన్నారు. మహర్నవమి పుణ్య దినాన వేదసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేద పఠనం రాష్ట్ర పురోభివృద్ధి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, వాటి మనుగడను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు కృషి చేస్తానని తెలిపారు.

వేదసభను వచ్చే ఏడాది మరింత అట్టహాసంగా నిర్వహిస్తామని కమిషనర్ పి. అర్జునరావు తెలిపారు. కరోనా వలన ఈ ఏడాది పరిమితి సంఖ్యలోనే నిర్వహించడం జరిగిందన్నారు. వేద పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహకాలు అందించి, వేదాల పరిరక్షణకు, వేద విద్య ప్రోత్సహించేందుకు చర్యలు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలతో సమన్వయం చేసుకుని..వాటి సిలబస్​ను అన్ని వేద పాఠశాలల్లో భోదించేందుకు చర్యలు తీసుకుంటునట్లు కమిషనర్ తెలిపారు.

దేవస్థానం ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళ నుంచి వేద సభ నిర్వహించి వేద పండితులను సత్కరించటం ఆనవాయితీగా ఉందని ఆలయ ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ప్రతి ఏడాది 400 మంది వేదపండితులను సత్కరించటం జరిగేదని తెలిపారు. వేద పండితుల వల్లనే దేవాలయాలు భక్తులతో విరాజిల్లుతున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో వేద పండితులు జూనియర్ అసిస్టెంట్ లుగా ఉంటున్నారని, వారి పోస్ట్ యొక్క గ్రేడ్ పెంచాలని సురేష్ బాబు కోరారు. కరోనా పరిస్థితిల్లో ఎక్కువమంది వేద పండితులను తీసుకుని రాలేకపోయామని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.