కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె. కొత్తపాలెం దగ్గర కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ఎడ్లబండ్లను పట్టుకున్నారు. వాటిని మోపిదేవి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు అవనిగడ్డ సీఐ బి.భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పది రోజుల క్రితం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 11 ఎడ్లబండ్లను పట్టుకున్నప్పటికీ వారిలో మార్పురాలేదని మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎడ్లబండ్ల యజమానులకు జరిమానా విధించారు.
ఇదీ చదవండి: కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్