అధికారంలోకి వస్తే అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ.. డీఎస్సీ-98 క్వాలిఫైడ్ ఐక్య పోరాట వేదిక సభ్యులు ధర్నా చేపట్టారు. 'జగన్ అన్నపై నమ్మకం' పేరుతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు.
అభ్యర్థులకు న్యాయం జరిగేలా మండలిలో సమస్యను లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. గత 15 ఏళ్లుగా డీఎస్సీ-98లో అర్హత సాధించిన అభ్యర్థులు పోరాడుతున్నారని.. ఇప్పటికైనా వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ఐక్య పోరాట వేదిక కన్వీనర్ శివప్రసాద్ కోరారు. ఎమ్మెల్సీ కమిటీ నివేదిక ప్రకారం.. సుమారు 4,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: