ETV Bharat / state

'కృష్ణా జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం' - కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్ వార్తలు

కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌‌(వ్యాక్సిన్‌ మాక్‌ డ్రిల్‌) చేపట్టారు అధికారులు. కొ-విన్‌ యాప్‌ పరిశీలన, వ్యాక్సిన్‌ పంపిణీలో తలెత్తే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపనున్నారు.

Covid Vaccine Dry Run
Covid Vaccine Dry Run
author img

By

Published : Dec 28, 2020, 11:52 AM IST

కృష్ణా జిల్లాలో డ్రై రన్ విజయవంతమైందని సంయుక్త కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని వెల్లడించారు. కొ-విన్ పోర్టల్ పని తీరు బాగుందని అన్నారు. జిల్లాలోని ఐదు చోట్ల అధికారులు డ్రై రన్‌ సోమవారం నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేట పూర్ణా హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్‌ పీహెచ్‌సీలలో ఈ ప్రక్రియను చేపట్టారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ... పోలింగ్ తరహాలో డ్రై రన్ చేపట్టామని పేర్కొన్నారు. దేశంలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ నిర్వహించినందున.. కేంద్రం చేసే సూచనలతో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. టీకా డ్రైరన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గ దులను ఏర్పాటు చేశారు.

మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో పరిశీలన జరిగింది. ఐదు కేంద్రాల్లో నిర్వహించిన డ్రైరన్‌ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి కార్యాచరణ నివేదికను రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌లకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'త్వరలో అందరికీ సరిపడా టీకాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.