శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన కార్మికులకు సాంకేతిక కారణాలతో నిలిపివేసిన రేషన్ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు.
ఆకలితో అలమటిస్తున్నారు..
కరోనా, లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో అలమటిస్తుంటే నెలకు రెండు సార్లే ఉచిత రేషన్ అందిస్తున్నారని తెలిపారు.
సగం రేషన్ మాత్రమే..
వలస వచ్చిన వారికి ఏప్రిల్ నుంచి సగం రేషన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ నెల నుంచి రేషన్ వీరికి నిలిపివేశారన్నారు. ఈ చర్యతో శ్రీకాకుళం జిల్లా వలస ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సాంకేతిక కారణాలతో..
శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి రేషన్ పథకం అమలులో ఉన్నందున సాంకేతిక కారణాలతో రేషన్ను నిలిపివేయడం అన్యాయమని స్పష్టం చేశారు.
ఆ చర్య అమానుషం..
వలస కూలీలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటనలు చేస్తూ వలస కూలీలకు రేషన్ కోత పెట్టడం అమానుషమన్నారు. వన్ నేషన్ - వన్ రేషన్ పేరుతో దేశంలో ఎక్కడ ఉన్నా రేషన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి వచ్చిన శ్రీకాకుళం జిల్లా వాసులకు నిలిపివేయటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమన్నారు. వెంటనే వలస వాసులందరికీ రేషన్ అందించాలని బాబురావు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి