ETV Bharat / state

నచ్చిన బొమ్మ అద్దెకొచ్చెనమ్మ... అల్లరి తగ్గించెనమ్మ!

ఆయనో సాంకేతిక నిపుణుడు. వివిధ దేశాల్లో సాఫ్ట్​వేర్​ రంగంలో ఉద్యోగం చేశారు. సరదాగా చదివేందుకు పుస్తకాలు కొనమని కుమారుడు అడిగిన కోరికతో ఆయనలో కొత్త ఆలోచన పుట్టింది. అనుకున్నదే తడవుగా... ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి... పుస్తకాలు, బొమ్మలు అద్దెకిస్తామంటూ కొత్త ట్రెండ్​ సృష్టించారు.

నచ్చిన బొమ్మ అద్దెకొచ్చెనమ్మ... పిల్లల అల్లరి తగ్గించెనమ్మ!
author img

By

Published : May 7, 2019, 11:35 AM IST

Updated : May 7, 2019, 11:48 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్ అమెరికా సహా వివిధ దేశాల్లో సాఫ్ట్​వేర్​ డెవలపర్​గా పని చేశారు. ఏడాదిన్నర క్రితం సొంతూరు వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఓ సాఫ్ట్​వేర్ సంస్థ ప్రారంభించారు. అందులోనూ సంతృప్తి లేక పాడి రైతుగా మారి... రియల్ మిల్క్ బ్రాండ్ ప్రారంభించారు. ఇప్పుడు అదే పేరుతో పుస్తకాలు, ఆటవస్తువులు అద్దెకిస్తూ విజయవాడ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

తనకు ఎదురైన అనుభవమే..!

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే చాలు ఆటవస్తువుల కోసం గొడవే. పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని కొనిస్తే...వారం రోజుల్లో పాడు చేసి మూలన పడేస్తారు. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకాలు, చరిత్ర తెలిపే పుస్తకాలు వేల సంఖ్యలో కనిపిస్తాయి. సరేలే అని కొన్నా చదువుతారా లేదో తెలియదు. ఇలాంటి సమస్య నుంచి పుట్టిందే ఈ సరికొత్త వ్యాపార సూత్రం. పుస్తకాల కోసమని పది వేలు కావాలన్న కుమారుడి అభ్యర్థనతో ఆలోచనలో పడ్డారు శ్రీనివాస్. ఇది తనకు పెద్ద మొత్తం కాకపోయినా మధ్యతరగతి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని లోలోపలే మథనపడ్డారు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించి... పిల్లల కోసం పుస్తకాలు, బొమ్మలు అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు!

అనుకున్నదే తడవుగా... తన రియల్ మిల్క్ యాప్‌లోనే పుస్తకాలు, బొమ్మల అద్దెకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ముందుగా తనకు తెలిసిన వాళ్లకే అద్దె బొమ్మలు, పుస్తకాల గురించి వివరించారు. రియల్ మిల్క్ యాప్‌లో పుస్తకాలు, బొమ్మల కోసం ఒకసారి సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఆరు నెలల పాటు వారానికి రెండేసి పుస్తకాలు, బొమ్మలు చొప్పున ఇంటికే తీసుకేళ్లొచ్చు.

ఎప్పుడైనా ఆడుకోవచ్చు..

బొమ్మలు, పుస్తకాలు జాగ్రత్తగా తిరిగి అప్పగించేందుకు వినియోగదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తం తీసుకుంటారు. ఈ విధానం వల్ల పిల్లలకు పుస్తకాలు, బొమ్మలను భద్రంగా ఎలా వాడాలో తెలుస్తుందనేది వీరి ఆలోచన. ఇంటింటికీ పుస్తకాలు, బొమ్మలు అందిచడమే కాదు... సబ్ స్క్రైబ్ చేసుకున్న వారు ఎప్పుడైనా ఈ రియల్ మిల్క్ గ్రంథాలయానికి వచ్చి నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చు, మెచ్చిన బొమ్మతో ఆడుకోవచ్చు.

అద్దెకు బొమ్మ కావాలా..నాయనా..!

Thiruvananthapuram (Kerala), May 07 (ANI): Telangana Chief Minister on Monday met Kerala Chief Minister Pinarayi Vijayan. The meeting between the two leaders took place at the official residence of CM Vijayan in Thiruvananthapuram. According to sources, both the Chief Ministers held discussions on contemporary politics in view of ongoing Lok Sabha elections. CM Rao is expected to visit Rameswaram and Srirangam temples before returning to Hyderabad.
Last Updated : May 7, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.