కృష్ణా జిల్లా గన్నవరం చిన్న అవుటపల్లి వద్ద ఉన్న పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో.. ఆరో నెలకే ఓ శిశువు జన్మించింది. అదీ.. కేవలం ఐదు వందల గ్రాముల బరువుతోనే. ఈ బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులు.. ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ప్రాణాన్ని నిలబెట్టారు. వెంటిలేటర్ సాయంతో ఇరవై రోజుల నుంచి ఆ పసిపాపకు వైద్యం అందిస్తున్నారు. వైజాగ్ వైద్య కళాశాలకు చెందిన చిన్నపిల్లల నిపుణుడు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇలాంటి శిశివు బతకటం కష్టమనీ, ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమైంది అని డాక్టర్ రమేష్ బాబు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ గర్భిణికి అనారోగ్యంగా ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో శిశివును బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. ఐదు వందల గ్రాములతో పుట్టిన ఈ శిశువు ప్రస్తుతం ఐదు వందల అరవై గ్రాముల బరువుకు వచ్చిందనీ, ఆరోగ్యం బాగానే ఉందనీ చెప్పారు.
ఇదీ చదవండి: