మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన వైద్యుల కమిటీని నియమించింది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఎనస్థీషియా నిపుణులు అచ్చెన్నాయుడు పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. గతంలో తలెత్తిన శస్త్రచికిత్స గురించి..తాజాగా అచ్చెన్నాయుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలేమిటనే విషయమై వైద్యులు పరిశీలన చేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడి డిశ్చార్జ్ పై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున చేపట్టాల్సిన చర్యలను వైద్యులు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించింది.
ఇదీ చూడండి..