కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల వేధింపులతో మహిళా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడు ఆర్.యమ్.ఓ.కుమార్, తాత్కలిక సేవల సూపర్ వైజర్ నాగేంద్ర.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళా సిబ్బంది ఆరోపించారు.
కుమార్ చేష్టలపై ఆగ్రహించిన 37 మంది ఆసుపత్రి సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న డాక్టర్ కుమార్, నాగేంద్రలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.