వర్షాకాలం వచ్చిందంటే పొలం పనులు ముమ్మరంగా సాగుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అన్నదాతలు వివిధ పంటలు సాగు చేయటానికి తమ పొలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో రైతులు, రైతు కూలీలు చాలా మంది పాముకాట్లకు గురవుతున్నారు. తక్షణ వైద్యం అందక కొంతమంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. మరికొంతమంది ఆసుపత్రిలో చేరి ప్రాణాలు నిలబెట్టుకున్నా... చికిత్స కోసం వేలు ఖర్చు చేస్తున్నారు.
అయితే పాము కాటుకు గురైన వారు హొమియోపతితో తక్కువ ఖర్చుతోనే వైద్యం చేసుకోవచ్చని అంటున్నారు కృష్ణా జిల్లా గుడివాడలోని హొమియోపతి పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చింతా రవీందర్. పాముకాటుకు హొమియోపతిలో ఎన్ని రకాల మందులు ఉన్నాయి?... వాటిని ఎలా వాడాలి? వంటి వివరాలను ఆయన ఈటీవీ భారత్తో పంచుకున్నారు.