రకరకాల ప్రదర్శనలు చూశాం... తాతల కాలం నాటి అపురూపమైన వస్తువుల మ్యూజియాలనూ చూశాం. కానీ.. ఇలాంటి మ్యూజియం విశేషాలు మాత్రం చాలా మందికి తెలిసి ఉండవు. ఎందుకంటే.. ఇది వైరస్ ల మ్యూజియం కాబట్టి. ఈ ప్రదర్శన శాల పేరు.. మైక్రోషియా. ప్రపంచంలో ఏకైక సూక్ష్మజీవుల మ్యూజియం ఇదే.
⦁ నెదర్లాండ్స్లోని ఆమ్ స్టార్ డ్యామ్ లో ఉందీ మ్యూజియం.
⦁ సూక్ష్మ జీవులు. ఈ పేరైతే విని వుంటారుగా. కంటికి కనిపించనంత చిన్నగా వుండే వైరస్. బ్యాక్టీరియా, శిలీంధ్రాల్లాంటివే సూక్ష్మజీవులన్నమాట. ఆహారం పాడవ్వటానికి, ఇంకా ఇదిగో ఇప్పుడు బెదరగొడుతున్న కరోనా వైరస్ మాదిరిగా వ్యాధులు కలగజేయటానికి ఇదే కారణం.
⦁ ఈ మ్యూజియంలో ఇలాంటి రకరకాల సూక్ష్మజీవుల్ని చూడచ్చు. ఇవి ఎలా విస్తరిస్తాయి. ఎలాంటి చోట్ల ఉంటాయి పదార్ధాల్ని ఎలా కుళ్లుగొడతాయి వంటి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే కొన్ని ఆహార పదార్ధాల, జీవ ఇంధనాల తయారీలో మనకు మేలు చేసే సూక్ష్మజీవుల వివరాలనూ ఈ ప్రదర్శన శాల నిర్వాహుకలు అందుబాటులో పెట్టారు.
⦁ కంటితో నేరుగా చూడలేని ఈ జీవుల్ని మనం చూడటానికి మైక్రోస్కోపుల్లాంటి ప్రత్యేమైన ఏర్పాట్లుంటాయి. వీటిని వివరించే యానిమేషన్ వీడియోలూ ఉంటాయి.
⦁ మన శరీరంలో ఏ రకమైన సూక్ష్మజీవులు ఉంటాయో నేరుగా తెలిపే బాడీ స్కానర్.. ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యే సూక్ష్మజీవుల వివరాలనూ.. ఇక్కడ చూడొచ్చు. వాటి విశేషాలు తెలుసుకోవచ్చు. వైరస్ ల ఆకారాలను కూడా చూసి తెలుసుకోవచ్చు.
⦁ భయంకరమైన ఎయిడ్స్, ఎబోలా వ్యాధుల్ని కల్గించిన వైరస్ ఆకారాల్నీ ఇందులో ఉంచారు.
⦁ మన ఇంట్లో ఉండే ఆహార పదార్ధాలపై ఎలాంటి సూక్ష్మజీవులుంటాయన్నదీ.. తెలుసుకోవచ్చు.
⦁ కానీ... ఇప్పుడు కరోనా కలకలం అక్కడా ఉంది కాబట్టి కొంతకాలం పాటు మూసేశారు.
ఇదీ చదవండి: