కృష్ణాజిల్లా దివిసీమలో ఎన్నో చారిత్రక దేవాలయాలు, ప్రకృతి సిద్ధమైన ఎన్నో పర్యటక ప్రాంతాలు చూపరులను కట్టి పడేస్తాయి. సముద్ర అలల సవ్వడులు, నదిలో పడవల సోయగాలు ఇలా ఎన్నో ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తాయి. కొవిడ్ ప్రభావం వల్ల పర్యటక ప్రదేశాలు వెలవెలబోతున్నాయి .
కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో పక్షుల కిలకిలలు, తాబేళ్ల బుడి బుడి అగుగులు, సముద్రం ఒడ్డున ఎర్రటి తివాచిలా ఎర్రటి పీతలు ఇలా చాలా అందాలు కనువిందు చేస్తున్నాయి. మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఘంటసాలలో జలదీశ్వర స్వామి ఆలయం, బౌద్ధ మ్యుజియం, శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం, హంసలదీవి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, నడకుదురు పాటలీ వృక్షాలు వంటి పుణ్యక్షేత్రాలు అటు భక్తిని...ఇటు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యటకులను కనువిందు చేస్తున్నాయి.
కొవిడ్ ప్రభావం తొలగిపోగానే రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రదేశాల గురించి విస్తృత ప్రచారం చేసి పర్యటకులను ఆకర్షించే విధంగా, చారిత్రక ప్రదేశాలు సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణాకు తగ్గిన వరద...ముంపులోనే పంటపొలాలు