ETV Bharat / state

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

author img

By

Published : May 25, 2020, 8:49 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వలస కార్మికులకు, నిరుపేదలకు కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు నెలరోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Distribution of food under Satyasai Seva Samiti
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో.. నెలరోజులుగా లాక్​డౌన్ తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, నిరుపేదలకు అహారాన్ని అందిస్తున్నారు. రైల్వేశాఖ సమన్వయంతో విజయవాడ వద్ద శ్రామిక్​రైళ్లలో తరలివెళ్తున్న వారికి 3 రోజుల నుంచి చపాతీలు, తాగునీరు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.

జాతీయ రహదారి మీదుగా తమ స్వస్థలాలకు వెళ్తున్న వారికి బెంజి సర్కిల్, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అమృత కలశం పేరిట నిరుపేదలకు నెలరోజులకు సరిపడా పప్పులు, బియ్యం ఇతర నిత్యావసరాలు అందిస్తున్నామని సేవా సమితి విజయవాడ ప్రతినిధి సాయివిశ్వనాథం తెలిపారు.

ఇదీ చదవండి:

లాయర్ల కార్పస్‌ నిధికి రూ.100 కోట్లు: సీఎం జగన్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.