ETV Bharat / state

విశ్రాంత రైల్వే ఉద్యోగి అదృశ్యం.. మూడు ఠాణాల మధ్య అయోమయం - విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్​

ప్రకాశం బ్యారేజీపై గుర్తు తెలియని ద్విచక్రవాహనంపై ఉన్న ఆధార్​ కార్డు, విశ్రాంత రైల్వే ఉద్యోగి ఐడీ కార్డు కలకలం రేపాయి. బ్యారేజీపై విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనం నిలిపి ఉన్న విషయాన్ని వన్ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆ వాహనంపై రైల్వే విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను గుర్తించారు.

విశ్రాంత రైల్వే ఉద్యోగి అదృశ్యంపై మూడు ఠాణాల మధ్య అయోమయం

author img

By

Published : Oct 30, 2020, 5:01 AM IST

ప్రకాశం బ్యారేజీపై గుర్తు తెలియని ద్విచక్రవాహనంపై ఉన్న ఆధార్​ కార్డు, రైల్వే ఉద్యోగి ఐడీ కార్డు కలకలం రేపాయి. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సదరు వాహనంపై రైల్వే విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన గుర్తుంపు పత్రాలను పరిశీలించారు. అనంతరం వన్​టౌన్ పోలీసులు విషయాన్ని ఆయోధ్య నగర్​లో ఉన్న ప్రసాద రావు కుమార్తె శాంతి శైలజ దృష్టికి తీసుకెళ్లారు.

అవి మా నాన్నవే..

వస్తువులను పరిశీలించిన శాంతి శైలజ తమ తండ్రివే అని నిర్ధారించారు. బ్యారేజీ పైనుంచి అతను నదిలోకి దూకాడా, లేదా వాహనాన్ని, కార్డులను అక్కడ వదిలి వెళ్లాడా అన్న విషయంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెలరేగింది.

కేసు నమోదు చేయమంటే సలహా ఇచ్చారు..

ఓ వైపు ఇంటి పెద్ద కనిపించడం లేదన్న బాధ, మరోవైపు పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదన్న ఆవేదన బాధితుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఘటనపై కేసు నమోదు చేయమని పోలీసులను అడగ్గా.. అయోధ్యనగర్ ఇంటి నుంచి ప్రసాదరావు బయలుదేరారు కనుక సింగ్​ నగర్ ఠాణాలో ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నారు.

సింగ్ నగర్​లో నమోదు..

సింగ్ నగర్ ఠాణాలో ఫిర్యాదు చేద్దామని వెళ్లగా సంఘటన స్థలం వన్​టౌన్, కృష్ణ లంక పరిధిలో ఉన్నందున అక్కడే ఫిర్యాదు చేయమని తిప్పిపంపినట్లు ఆమె తెలిపారు. చివరకు మూడు ఠాణాల మధ్య చుట్టు ప్రదక్షిణాలు చేసిన అనంతరం కథ పోలీస్ కంట్రోల్ రూమ్​ వద్దకు చేరింది. ఫలితంగా కొందరు పెద్దల సహకారంతో సింగ్ నగర్ పోలీస్ స్టేషన్​లో కేసును నమోదు చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి : మందు బాబులకు శుభవార్త.. మద్యం ధరలు తగ్గించిన సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.