PULIGADDA ACQUEDUCT:కృష్ణా జిల్లా మోపిదేవిలో కృష్ణానదిపై పులిగడ్డ వద్ద అక్విడక్ట్‌ను 1936లో నిర్మించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో, ప్రజలకు తాగు, సాగునీటి కోసం అక్విడక్ట్‌ను నిర్మించారు. సాగు భూమి పెరగడం అప్పట్లో మంత్రిగా ఉన్న మండలి వెంకటకృష్ణారావు అక్విడెక్ట్ ఆనుకుని మరొక తొట్టె నిర్మించారు. ప్రస్తుతం అక్విడెక్ట్‌కు మరమ్మతులు లేక కాలువల ద్వారా వచ్చిన నీరు కృష్ణా నదిలోకి వృథాగా పోతుంది. వరదల వచ్చినప్పుడు నీరు వేగంగా ప్రవహించి చెత్త అడ్డుపడటంతో నీటి ఒత్తిడి వల్ల అక్విడక్ట్‌కు ఎక్కువగా నష్టం జరుగుతుంది.
దివిసీమ సముద్ర తీరంలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలు ఎక్కువగా తుపాన్ల తాకిడికి గురవుతాయి. భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు రావడంతో వేసవిలో తాగు, సాగునీటి కోసం ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్విడెక్ట్‌పై ఉన్న రైలింగ్‌లు పడిపోతున్నాయని స్థానికులు వాపోయారు. కాలువల ద్వారా వచ్చిన నీటిని చెరువుల్లో నింపుకుని తాగునీరు కోసం వాడుకుంటాన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్విడక్ట్ లేకపోతే దివిసీమ ఎడారిగా మారిపోతుందని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి... పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..