తన ఇంటిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ... కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఈ దాడిలో తన భర్త, అత్తామామలు తీవ్రంగా గాయపడ్డారని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చేసేదేమీ లేక ఠాణా ఎదుట రోడ్డుపై బైఠాయించినట్లు బాధితురాలు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.