ETV Bharat / state

ధారావి ఆదర్శం.. కరోనా కట్టడికి ఇదొక్కటే మార్గం! - కరోనా వైరస్ తాజా వార్తలు

కరోనాపై మహా సంగ్రామంలో ప్రజలే నిర్ణయాత్మక శక్తులని ప్రధాని పదే పదే చెబుతున్నారు. అయినా చాలామందిలో నా ఒక్కడివల్ల ఏమవుతుందిలే అన్న ఉదాసీనత కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు మరొకరిపై నిందమోపడమే గాని మనం ఎంత బాధ్యతగా మెలుగుతున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌ను ఎలా కట్టడి చేయవచ్చో ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియాలాంటి దేశాలు చూపించగా భారత్‌లోనూ కేరళ, ధారావి లాంటి చోట్ల కనిపించిన ప్రజల సామాజిక బాధ్యత అందరికి కనివిప్పు కలిగించాల్సిన అవసరం ఉంది.

corona
corona
author img

By

Published : Jul 14, 2020, 8:03 AM IST

ధారావి ఆదర్శం.. కరోనా కట్టడికి ఇదొక్కటే మార్గం!

కరోనా వైరస్‌పై పోరులో ప్రజల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం లోటుగా కనిపిస్తోందని అంటున్నారు ప్రజారోగ్య వైద్య నిపుణులు. వైరస్‌ మహమ్మారి పట్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నవారు ఓ వైపు ఉంటే .. మనకేం కాదులే అంటూ రోడ్లపై తిరిగే వారు మరో వైపు కనిపిస్తున్నారు. ముఖానికి మాస్కు ధరించకుండా పట్టుబడినవారి నుంచి కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనులనుంచి జరిమానాల రూపేణా అటు ఒడిశా ఇటు దిల్లీలో రెండు కోట్లకు పైనే వసూలైందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

భౌతికదూరం నిబంధన పాటించకపోతే 14 రోజుల లాక్‌డౌన్‌ విధిస్తామని ఆగ్రా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అటు కేరళ కొత్తశిక్షలు ప్రకటించింది. ఎవరో నియంత్రిస్తేనే తప్ప ప్రజలు సామాజిక బాధ్యతలు గుర్తెరగకపోవడం, ఏరికోరి పెనుముప్పు కొనితెచ్చుకోవడమే.

ధారావి ఆదర్శం

లాక్‌డౌన్ సడలింపుల కారణంగా పెరుగుతున్న కేసులను ప్రజల భాగస్వామ్యంతో చెక్ పెట్టవచ్చనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ధారావి. దేశంలోనే అతిపెద్ద మురికి వాడగా పేరుగాంచిన ధారావిలో కరోనా విజృంభిస్తే నష్టం ఊహాలకు కూడా అందదని అందరూ అనుకున్నారు. కానీ భయాందోళనలు దూరం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది ధారావి. అందుకే ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ ఎంతగా చెలరేగిపోయినా అడ్డుకట్ట వేయగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది.

వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా కరోనా మహమ్మారి బారి నుంచి ధారావి బయటపడగలిగిందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. వైరస్ ఎంతగా వ్యాప్తి చెందినప్పటికీ నియంత్రించగలమని ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావి నిరూపించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో.. పరీక్షలు ముమ్మరం చేయడం, సామాజిక దూరం పాటించడం, రోగులకు తక్షణ చికిత్స అందించడం కారణంగా కరోనాతో జరిగిన యుద్ధంలో ధారావి విజయం సాధించిందని అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే విజయం

ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ప్రజల్ని భాగస్వాములుగా చేయడం అంటే.. ప్రజల తమ బాధ్యతను గుర్తుచేసుకోవడమే. సమాజమంటేనే ప్రజలన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని.. ఎవరికో ఆ బాధ్యతను విడిచిపెట్టకుండా మనమే ముందుకు రావాలి. ముందుగా మనం ఆబాధ్యతను నెరవేర్చాలి. ప్రజల భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో చర్యలు పకడ్బందీగా అమలయ్యే అవకాశం ఉంటుంది. స్థానికంగా వైరస్ వ్యాప్తిని గుర్తించడం, ఎక్కువ రిస్క్‌ ఉన్నవారు, వయసు మీరినవారిని గుర్తించి వారిని ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచటం వంటివి స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయి. అనుమానితులను గుర్తించడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించగలరని అంటున్నారు ప్రజారోగ్య వైద్య నిపుణులు.

వైరస్‌ వ్యాప్తిని అడ్డికోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో మార్గదర్శకాలు రూపొందించాయి. అయితే క్షేత్ర స్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల వాటిని పాటించడంలో చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. అదే సమయంలో ప్రజారోగ్యానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో వారిని కూడా భాగస్వాములుగా చేస్తే మంచి ఫలితాలు వచ్చేవన్నది జేఎన్‌యూకు చెందిన ఆచార్యుల అభిప్రాయం. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు వివిధ రకాలుగా ఉంటారు. వారి సంస్కృతీ సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. అందువల్లే పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ఇక్కడ అమలు కావాలంటే.. స్థానికంగా ఉండే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికత ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ వ్యవస్థాగత లోపాలు... వాటి అమలులో ఆటంకాలు సృష్టించేలా చేస్తాయి. అందుకే ప్రజల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది

ప్రజల భాగస్వామ్యం అవసరం

ప్రస్తుతం మహమ్మారిని నియంత్రించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రముఖ మెడికల్ జర్నల్‌ లాన్సెట్‌ సూచించింది. కరోనాపై అపోహాలు తొలగించడం, సామాజిక కట్టుబాట్లను అర్థం చేసుకుని తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నవారికి రక్షణ కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి కార్యక్రమాలు స్థానికంగా ఉండే వారితోనే సాధ్యమని.. అందుకే వారిని ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించింది.

ఆ దేశాల్లో ఇలా..

చాలా వరకు దేశాల్లో ప్రభుత్వాల కన్నా క్షేత్ర స్థాయిులో ప్రజలు భాగస్వాములుగా మారి అందించిన సేవల వల్ల ఎక్కువ ఫలితాలు కనిపించినట్టు ఉదాహరణలు చెబుతున్నాయి. స్థానిక నేతల సహకారంతో వైరస్‌ తీవ్రతను తెలియజెప్పి వారిలో అవగాహన తీసుకు వచ్చి.. వైరస్ వ్యాప్తిని నిరోధంచటంలో విజయం సాధించింది ఆఫ్రికన్ దేశం కాంగో. అదే విధంగా బ్రిటన్‌, స్పెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి కార్యాచరణే చేపట్టారు. బంగ్లాదేశ్‌లో అయితే కొవిడ్ సమయంలో నీటి ప్రాముఖ్యతను గుర్తించి ఆ నీరు శుభ్రంగా ఉంచేందుకు అత్యవసర సహయక బృందాలను ఏర్పాటు చేసింది. సానిటేషన్‌ విభాగంలోనూ ఇలాంటి వ్యూహాలే రూపొందించింది. వీటిలో మహిళా స్వయం సహాయక బృందాలకు ఎక్కువగా అవకాశం ఇచ్చారు.

బాధ్యత గుర్తించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే వచ్చి చేస్తుందని భావించకుండా ఎవరికి వారు తమ సొంత బాధ్యతగా భావించి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎలాంటి అవకాశం ఉన్నా అందుకు ప్రయత్నించాలి. మనకు మనం శుభ్రంగా ఉండటం.. సామాజిక దూరం పాటిస్తే చాలదు ఇతరులు పాటించేలా చూడాలి. అనుమానితులను గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందిచంటం వంటివి చేయాలి. మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యంలేని చోట వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ప్రదేశాలను గుర్తించి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయాలి. మన ఒక్కరి వల్లే ఏమి కాదులే అనుకోవద్దు. ఒక్క వైరస్‌ కారక తుంపర చాలు ..నిండు జీవితానికి ముగింపు పలకడానికి. మనం జాగ్రత్తగా ఉంటూ ఇతరులను అప్రమత్తం చేయడం మన సామాజిక బాధ్యతగా గుర్తిస్తే కరోనాపై దాదాపుగా విజయం సాధించినట్టే.

ఇదీ చదవండి

కరోనాపై 'మిషన్​ ధారావి' ఎలా విజయం సాధించింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.