సామాజిక మాధ్యమాల్లో కొవిడ్- 19 వ్యాప్తి పై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా బాపట్లలో యువకుని ఆత్మహత్య ఘటన విచారకరమని....దానిపై విచారణకు ఆదేశించామని అన్నారు. ఈ ఘటన పై సీఎం జగన్ కూడా ఆరా తీశారని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసి... మిగతా సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్ట్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సరుకు రవాణా వాహనాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు. ఆరోగ్య రీత్యా అత్యవసరంగా వెళుతున్న వారి వివరాలను పరిశీలించి... రాష్ట్రంలోకి అనుమతించాలని సిబ్బందికి తెలిపారు. సరిహద్దు సిబ్బంది భద్రత కోసం గ్లౌస్, మాస్క్, యాప్రాన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోకి వచ్చే వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని హితవు పలికారు.
ఇవీ చదవండి...'వెంటిలేటర్ల కొరత రాకుండా ప్రత్యేక చర్యలు'