ETV Bharat / state

చిన్నారితో చాకిరీ.. డీజీపీ తీవ్ర ఆగ్రహం - డీజీపీ గౌతం సవాంగ్ వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వ్యాలుయేషన్ గదిని... 6 సంవత్సరాల పాపతో శుభ్రం చేయించటంపై డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

dgp gowtham sawang reaction on nellore minor girl working issue
చిన్నారితో చాకిరి చేయించిన ఘటనపై స్పందించిన డీజీపీ
author img

By

Published : May 18, 2020, 6:26 PM IST

Updated : May 18, 2020, 7:29 PM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో... చిన్నారితో స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించడం, ఆ సందర్భంగా పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించారు.

గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి... తన 6 ఏళ్ల కుమార్తెతో తుడిపించడం బాధాకరమైన విషయమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి అయినప్పటికీ చట్ట ప్రకారం శిక్ష తప్పదని పేర్కొన్నారు. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్, రెగ్యులేషన్ యాక్ట్ 1986 చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని పిల్లల చేత చాకిరీ చేయించడం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందన్నారు.

ఇదీ చదవండి:

పాపతో పని చేయించడం... వారికి పాపమని అనిపించలే..!

Last Updated : May 18, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.