ప్రజల భాగస్వామ్యంతో సామాన్యులు, నిరుపేదలు, అణగారిన వర్గాల భద్రతకు పోలీసుల సేవలు భరోసాగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ దామోదర్ గౌతంసవాంగ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు భద్రతను పెంచేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో ఏడాదిన్నర క్రితం వాసవ్య మహిలా మండలి, పీసీవీసీ, అమెరికన్ కాన్సులేట్‌లతో పోలీసు శాఖ సంయుక్తంగా మహిళా మిత్రల ద్వారా క్లాప్ పేరిట సమాజ భాగస్వామ్యంలో మహిళ రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామని డీజీపీ తెలిపారు. దాని ముగింపు సమావేశంలో డీజీపీ మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళా రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. సామాజిక సేవలో స్వచ్ఛంద కార్యకర్తలుగా పనిచేస్తోన్న మహిళా మిత్ర బృందాలను మరింత చైతన్యవంతులు చేస్తామని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని శక్తి బృందాలు- వాటి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖలో శక్తి బృందాల్లోని మహిళా పోలీసుల టిక్‌టాక్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి రావడంపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే మార్పులను కొందరు హానికరం కాదనో- ఆటవిడుపుగానో- ఆహ్లాదం కోసమో తమ విధుల నిర్వహణ సమయంలో వినియోగించడం సరికాదని- యూనిఫామ్‌లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవభావంతో మెలగాలని డీజీపీ హితవు పలికారు.
ఇదీ చూడండి... ఇంటికే కాదు ఇంట్లోని వస్తువులకూ బీమా!