ETV Bharat / state

'వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే.. రైతు మెడకు ఉరే'

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే రైతు మెడకు ఉరి వేసినట్లేనని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్​ పోస్టర్లు పెట్టుకు తిరుగుతున్న వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని దేవినేని నిలదీశారు. పసుపు చైతన్య కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో దేవినేని మాట్లాడారు.

Devineni Uma Oppose meters for agriculture bores
మాజీమంత్రి దేవినేని ఉమా
author img

By

Published : Nov 3, 2020, 8:52 PM IST

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టొద్దంటూ.. పసుపు చైతన్య కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులు, గ్రామస్థులతో కలసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే రైతు మెడకు ఉరి వేసినట్లేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్లకు కక్కుర్తిపడి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారని.. తమకు రూ.2500 కోట్లు ఇస్తానన్న కూడా రైతు మెడకు ఉరి తాడు వేయకూడదన్న ఉద్దేశంతో మీటర్లు బిగించడానికి ఒప్పుకోలేదని పక్క రాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.

ఉచిత విద్యుత్​ పోస్టర్లు పెట్టుకు తిరుగుతున్న వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని దేవినేని నిలదీశారు. సున్నా వడ్డీ గురించి గొప్పలు చెప్పారు కానీ రైతులు వడ్డీ కడితేనే మళ్లీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. సున్నా వడ్డీని సున్నా చేసేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా, పాదయాత్రలో చెప్పకుండా నేడు మీటర్లు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు. లక్షలు పెట్టి రైతుభరోసా కేంద్రాల భవనాలు కట్టి మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రైతుభరోసా కేంద్రాల దగ్గరకు వస్తే పంటకు రేటు పెరుగుతుందా అని ధ్వజమెత్తారు.

గతంలో సుబాబుల్ రైతులను ఉద్దరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఉమా గుర్తుచేశారు. నేడు సుబాబుల్ పంటను కొనే దిక్కు కూడా లేదన్నారు. టన్ను రూ.1400 కూడా లేని పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ వరద నిర్వహణలోపం వల్ల కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వరి, పత్తి, మిర్చి లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. 322 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. మూడు రాజధానులు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.