ఎన్నికల ముందు తెదేపా ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అవినీతి చేసిందని వైకాపా ప్రచారం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్కరూపాయి అవినీతి నిరూపించలేకపోయిందని దేవినేని అన్నారు. నిబంధనల మేరకే పోలవరం పనులు జరిగాయని కేంద్ర జలవనరుల శాఖ మరోమారు స్పష్టం చేసిందన్నారు. వైకాపా ప్రభుత్వ అసత్య ప్రచారాలకు ప్రజలకు సమాధానం చెప్తారని దేవినేని ఉమా అన్నారు.
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ