5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను, వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతన్నల కోరికను కాదని.. వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు అంటోందని.. మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ అడ్డు పడకపోతే ఈ ప్రభుత్వం అభివృద్ధి స్థానంలో అరాచకం సృష్టిస్తుందని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను తప్పుపట్టి ఇప్పుడు వైకాపా సాధించింది ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజన్న రాజ్యమని.. ఇష్టారాజ్యం చేస్తున్నారు: దేవినేని - జగన్పై దేవినేని కామెంట్స్
రాజన్న రాజ్యం అంటూ అధికారం చేపట్టి, ఇష్టారాజ్యంగా పాలన చేయడం ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. మూడు రాజధానులంటూ.. మెుండిగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు.