ETV Bharat / state

పేకాటను ప్రోత్సహిస్తున్న కొడాలిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: దేవినేని

author img

By

Published : Jan 3, 2021, 10:37 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో పేకాటను ప్రోత్సహిస్తున్న కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. గత 19 నెలలుగా గుడివాడలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారన్నారు.

దేవినేని
దేవినేని

కృష్ణా జిల్లా గుడివాడలో గత 19 నెలలుగా పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని దేవినేని ఉమా వ్యాఖ్యనించారు. నియోజకవర్గంలో పేకాటను ప్రొత్సహిస్తున్న మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తక్షణం బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుడివాడ చంద్రయ కాలువ పరిసరాల్లోని పేకాట శిబిరంపై ఇటీవల ఓ పోలీసు అధికారి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారన్నారు. దాడుల్లో 10 కోట్ల నగదు, 30 కార్లు పట్టుబడ్డాయని తెలిపారు.

పేకట శిబిరం మంత్రి కొడాలి ప్రధాన అనుచరులది కావటంతో నగదు, వాహనాలు వదిలేసి వెళ్లిపోవాలని పోలీసులను వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, కార్లను కోర్టుకు హాజరు పరిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

'అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.