ప్రపంచం మొత్తం కరోనాపై యుద్ధం చేస్తుంటే.. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కరోనా సమయంలో సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టాలని ఆయన హితవు పలికారు. గత 37 రోజుల్లో రాష్ట్రమంతటా క్వారంటైన్ కేంద్రాల్లో ఎక్కడ ఎంత మంది ఉన్నారో చెప్పాలని... ఏయే జిల్లాకు ఎంత ఖర్చు పెట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ-క్రాప్ బుకింగ్ డేటాను ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రికార్డెడ్ ప్రెస్ మీట్లోనైనా సీఎం జగన్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి