ETV Bharat / state

'మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' - vijayawada latest news

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వాపును చూసి గెలుపు అనుకుంటున్న వైకాపా నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. వైకాపాకు ఓటు వేయలేదని తెదేపా మద్దతుదారులపై దాడులు చేయటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Devineni Uma
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Feb 24, 2021, 7:16 PM IST

పంచాయతీ ఎన్నికల్లో వాపును చూసి గెలుపు అనుకుంటున్న వైకాపా నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన శెట్టి తిరుపతిరావును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమా పరామర్శించారు.

ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలో చనిపోయిన పాలకొల్లు సోమయ్య భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుబసభ్యులను దేవినేని ఉమ పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో రీకౌంటింగ్ పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఓట్లను దొంగలించారని ఉమా ధ్వజమెత్తారు. వైకాపాకు ఓటు వేయలేదని తెదేపా మద్దతుదారులపై దాడులు చేయటం దుర్మార్గమని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

'వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.