ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యాన విశాఖలో కొనుగోలు చేసిన భూముల్ని అమ్మేందుకే.. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గన్నవరంలో 32రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బోడె ప్రసాద్‌తో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. అమరావతి ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా సీఎం జగన్ నోరు మెదపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమన్నారు. ప్రజాపోరాటాలతోపాటు న్యాయస్థానాల ద్వారా రాజధాని తరలింపుపై పోరాడతామని ఉమ తెలిపారు. రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి : అనంత పంట పొలాల్లో విమానం అత్యవసర ల్యాండింగ్ !