తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్‌కు సమయం లేదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామలో పర్యటించిన దేవినేని.. అన్నదాతలను ఆదుకోవడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పంట నష్టం లెక్కించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయలేదని మండిపడ్డారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. గని అతుకూరు, చెవిటికల్లు గ్రామాల్లో పంటంతా వాలిపోయి పనికిరాకుండా పోయిందని తెలిపారు. వారం పాటు వరదలో నానిన పంటతో పూర్తిగా నష్టపోయారన్నారు.
ఇదీ చదవండి: