ETV Bharat / state

Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!

author img

By

Published : Jul 18, 2021, 7:27 AM IST

కొవిడ్ మూడో వేవ్ వస్తున్నందున్న.. ఆసుపత్రి వర్గాలలో ఆందోళన మొదలైంది. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు బాధితుల పరుగులు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌  పడకలకు మళ్లీ డిమాండ్​ పెరిగింది. కర్ఫ్యూకు మినహాయింపు ఇవ్వడంతో...నిర్లక్ష్యం మరింత పెరిగింది. ప్రజలు మాస్కు పెట్టుకోవట్లేదు..భౌతిక దూరం అనే విషయాన్నే గాలికి వొదిలేశారు.

Demand for oxygen, ICU and ventilator beds again due to breathing problems
కోవిడ్ మూడో వేవ్

కొవిడ్‌ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల వైద్య వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. కేసులు తగ్గుతున్నాయన్న ఉద్దేశంతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ జాగ్రత్తలు పాటించాలన్న సూచనలను ప్రజలు పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ముఖ్య కూడళ్లలో రద్దీ పెరుగుతోంది. చాలామంది మాస్కులు ధరించడం లేదు, దూరం కూడా పాటించట్లేదు. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరేవారు, డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్యలో వ్యత్యాసం క్రమంగా తగ్గుతోంది. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పుడు కేసులు తగ్గడంతో పాటు.. డిశ్ఛార్జిలు బాగా పెరిగాయి. మినహాయింపులు పెరిగిన తర్వాత డిశ్ఛార్జిలు నిలకడగానే ఉంటున్నాయి.

  • విజయవాడ జీజీహెచ్‌లో ఒక్కొక్క రోజు 15, 30 మంది చొప్పున బాధితులు చేరుతున్నారు. ఆక్సిజన్‌ శాతం తగ్గి శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారిలో దూర ప్రాంతాల వారూ ఉంటున్నారని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శివశంకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 170 మంది చికిత్స పొందుతున్నారు.
  • విశాఖ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలి మాట్లాడుతూ ‘కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పుడు కేసులు వెంటవెంటనే తగ్గాయి. ప్రస్తుతం కేజీహెచ్‌లో 50 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. కొత్తగా ఆసుపత్రుల్లో చేరేవారు, ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యే వారి సంఖ్య దాదాపుగా సమానంగా ఉంటోంది’ అన్నారు.
  • గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి మాట్లాడుతూ ‘కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఇంతకుముందు ఓపీలో 50 మంది వరకు రాగా ప్రస్తుతం వంద మంది వరకు వస్తున్నారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరిగింది. వీరిలో 80% మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతోంది’ అని తెలిపారు.
  • ‘కర్ఫ్యూ అమల్లో మినహాయింపులు పెరిగిన తర్వాత కేసుల నమోదు తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 12న ఆక్సిజన్‌ 7 కేఎల్‌ వాడాం. అంతకుముందు కంటే ఈ వాడకం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 170 మంది ఇన్‌పేషెంట్లు ఉంటే... 50 మంది వరకు ఐసీయూల్లో ఉన్నారు. వచ్చే కేసుల్లో ఆక్సిజన్‌ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి చెప్పారు.

జ్వరం తగ్గిందని...
వైరస్‌ బారిన పడినవారిలో కొందరు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. జ్వరం రాగానే మాత్రలు వేసుకుని, తగ్గగానే బయట తిరుగుతున్నారు. పూర్తిస్థాయిలో కొవిడ్‌ చికిత్స తీసుకోవడంలేదు. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలొస్తే హడావుడిగా ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఐసీయూల్లో 27% మంది
వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ ప్రకారం 25,526 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 20,441 మంది ఇళ్లలోనే ఉంటూ వైద్యం పొందుతున్నారు. మిగిలిన 5,085 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 27.3% మందికి ఐసీయూల్లో, వెంటిలేటర్లపై 21.19%, ఆక్సిజన్‌ పడకలపై 15.67%, 5.5% మందికి జనరల్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో చేరేవారే ఎక్కువ
కొవిడ్‌ చికిత్స అందించే ఆసుపత్రుల్లో 101 ప్రభుత్వాసుత్రులు ఉన్నాయి. వీటిల్లో 3,949 మంది వైరస్‌ బాధితులు ఉండగా 43.37% మంది ఐసీయూల్లో, వెంటిలేటర్లపై 23.8% మంది చొప్పున చికిత్స పొందుతున్నారు. విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 61 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రి కేసుల పెరుగుదల

జులై 2న 89, 3న 96, 4న 106, 5-122, 6-163, 7-231, 8-252, 9-308, 10-336, 11-271, 12-435, 13-509, 14-482, 15-599 16న 561 మంది చొప్పున ఆసుపత్రుల్లో చేరారు. 2 నుంచి 16మధ్య 4,566 మంది చేరితే 9,548 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

ఇదీ చూడండి. krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.