ETV Bharat / state

దసరాకు దాండియాతో స్వాగతం పలికిన అతివలు..!

"దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ..." అంటూ దాండియా నృత్యాలతో దసరా సంబరాలకు అతివలు స్వాగతం పలికారు. క్రియేటివ్ సోల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గార్భా, దాండియా మెగా ఈవెంట్ విజయవాడలో కన్నుల పండువగా జరిగింది. బెజవాడలో స్థిరపడిన ఉత్తరాదీలతో పాటు అచ్చతెలుగు ఆడపడుచులు సైతం దాండియా నృత్యాలతో సందడి చేశారు.

author img

By

Published : Sep 29, 2019, 3:23 PM IST

విజయవాడలో దాండియా, దసరా సంబరాలు
విజయవాడలో దాండియా, దసరా సంబరాలు

దసరా వచ్చిందంటే ముందుగా మనందరికి గుర్తొచ్చేది గార్భా, దాండియా నృత్యాలే...సాంప్రదాయ దుస్తులు ధరించి...అంతా ఒక్కచోట చేరి దాండియా నృత్యాలు చేస్తుంటే చూసేవారికి సైతం ఆడిపాడాలనిపిస్తుంది. అలా ఆడాలనుకునేవారికి శిక్షణ కూడా ఇస్తుందీ...క్రియేటివ్ సోల్ అనే సంస్థ.
దసరా ఉత్సవాల సందర్భంగా గార్భా, దాండియా నృత్య పోటీలను గత మూడేళ్లుగా క్రియేటివ్ సోల్ సంస్థ విజయవాడలో నిర్వహిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎస్.ఎస్ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్​లో స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు. వివిధ కారణాలతో విజయవాడలో నివసిస్తున్న ఉత్తరాదీలకు... ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల తమ సొంతూరిలో ఉన్నంత సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ఇటువంటి వేడుకల నిర్వహించడం పట్ల ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సతీమణి సుప్రవా హరించందన్ హాజరయ్యారు. ఈ మెగా ఈవెంట్​లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వహకులు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి: నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి?

Intro:ap_atp_61_29_yuoth_with_bear_av_ap10005
____:_______*
ఎలుగును తరిమిన యువకులు..
-------------*
తమ గ్రామంలో ఎలుగుబంటి ప్రవేశించి దాడి చేస్తుందని పసిగట్టిన యువకులు మూకుమ్మడిగా ఏకమై ఆ ఎలుగును తరిమికొట్టారు. తాజాగా శనివారం సాయంకాలం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామంలో ఎలుగు ప్రవేశించి ఓ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని గమనించిన యువకులు ఆ ఎలుగును వెంబడించి కొండ ప్రాంతాల్లో కి తరిమారు. ఈ తతంగాన్ని ఓ యువకుడు మోటార్ సైకిల్ పై వెళుతూ తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు స్థానిక గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి. రాయలప్పదొడ్డి గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. గ్రామం పరిసరాల్లో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. యువకులు చిత్రీకరించిన దృశ్యాల్లో గ్రామ ప్రాంతంలో నుంచి కొండ ప్రాంత వరకు పలు పొలాలు, రోడ్ల వెంట గొర్రెల మందలను దాటుకుంటూ ఎలుగుబంటి పరిగెడుతూ కిలోమీటర్ల కొద్దీ ఆద్యంతం అం చిత్రీకరించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం పట్టణ శాఖ అధికారులు ధృవీకరించారు.Body:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాConclusion:రామక్రిష్ణ కళ్యాణదుర్గం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.