కృష్ణా జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం జరుగుతున్న క్రమంలో కళ్యాణ మండప శిలాఫలాకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
కళ్యాణమండం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ.. తెదేపా జడ్పీటీసి సభ్యులు ఖండించారు. సంఘటనా స్థలం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.