ప్రభుత్వం తమకిచ్చిన భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో దళితులు వ్యవసాయ పనులకు ఉపక్రమించారు. 1977లో కృష్ణాజిల్లా మైలవరం రెవెన్యూ పరిధిలో దళితులకు ప్రభుత్వం కేటాయించిన.. సుమారు 86 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వాములు, ఆక్రమణదారుల నుంచి తమ స్థలాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
భూములకు పట్టా ఉన్నా.. కొందరు బెదిరింపులకు దిగుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హయాంలో తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. దళితులకు న్యాయం చేయడానికి.. ప్రస్తుత శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'రాజధాని విషయంలో ప్రభుత్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'