ETV Bharat / state

వాట్సాప్​తో సైబర్ నేరగాళ్ల మోసాలు

వాట్సాప్​ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వీరిబారినపడిన పలువురు లబోదిబోమంటున్నారు. ఎవరైనా మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాట్సాప్​లో కొత్తగా వచ్చిన రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని వినియోగించుకోవాలి.

author img

By

Published : Jun 26, 2020, 7:39 AM IST

Cyber ​​criminals scams with WhatsApp
వాట్సాప్​తో సైబర్ నేరగాళ్ల మోసాలు..

సైబర్ నేరగాళ్లు వాట్సాప్​ను ఉపయోగించుకుని సరికొత్త మోసాలకు తెరలేపారు. ఇప్పటికే వీరిబారినపడిన పలువురు లబోదిబోమంటున్నారు. అచ్చం వాట్సాప్ సంస్థ నుంచి వచ్చినట్లే సందేశం పంపిస్తారు. తమను తాము సాంకేతిక బృందంగా పేర్కొంటారు. ప్రొఫైల్ పిక్​లోనూ ఆ సంస్థ అధికారిక లోగో మాదిరిదే ఉంచుతారు. మీ వాట్సాప్ నెంబర్​కు వచ్చిన ఆరెంకెల పరిశీలన రహస్య సంఖ్య( వెరిఫెకేషన్ కోడ్) ను తమకు పంపించాలని కోరుతారు. వారిని నమ్మి ఆ సంఖ్యను పంపించారో అంతే సంగతులు.

పిన్ నెంబర్ ఉపయోగించుకుని నేరగాళ్లు మీ వాట్సాప్ నెంబర్​తో వారి ఫోన్/ కంప్యూటర్​లో లాగిన్ అవుతారు. వెంటనే మీ వాట్సాప్ పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వాట్సాప్ ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది. అంతకముందే కొన్ని మోసపూరిత లింక్​లను పంపించి..మీ ఫోన్​ను సైతం హ్యాక్ చేస్తారు. క్రెడిట్,డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరిస్తారు. మీ కాంటాక్టులోని వ్యక్తుల ఫోన్​నెంబర్​లకు డబ్బులు ఇవ్వాలని కోరుతూ సందేశాన్ని పంపిస్తారు.

ఆ సందేశాలకి అస్సలు స్పందించొద్దు..

పిన్​ నెంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే సందేశాలకు స్పందించొద్దు. వెరిఫికేషన్ పిన్​ను ఇప్పటికే ఎవరికైనా పంపించి ఉంటే.. మీ ఖాతాను వెంటనే రీ వెరిఫై చేయించాలి. ఎవరైనా మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాట్సాప్​లో కొత్తగా వచ్చిన రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని వినియోగించుకోవాలి.

ఇదీ చూడండి. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.