ETV Bharat / state

స్నేహం పేరుతో వల..సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్త

author img

By

Published : May 23, 2020, 8:37 PM IST

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఎత్తుగడలతో లూఠీ చేస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకూ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈమెయిల్స్‌.. ఓఎల్​ఎక్స్.... ఓటీపీల పేరుతో దోచుకుంటున్నారు. పోలీసులు, మీడియా సైబర్‌ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా... వేల సంఖ్యలో వారి బారిన పడుతున్నారు.

cyber crime increasing in hyderabad
హైదరాబాద్​లో సైబర్​ నేరాలు

హైదరాబాద్​లో సైబర్​ నేరాలు

తెలంగాణలో సైబర్ నేరాలు ఆగడం లేదు... రోజూ పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. బాధితుల్లో ఎక్కువగా చదువుకున్నవారే ఉంటున్నారు. తాజాగా నకిలీ మెయిల్ పంపి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. యాభై వేలు కాజేశారు. ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన నేరగాళ్లు డబ్బులు అత్యవసరంగా కావాలంటూ అతని స్నేహితుడికి మెయిల్ పంపారు. నిజమే అనుకుని వారు పంపించిన బ్యాంకు ఖాతాకు స్నేహితుడు నగదును బదిలీ చేశాడు. మరుసటి రోజు తన మిత్రుడికి ఫోన్ చేయగా తాను మెయిల్ పంపలేదనగా స్నేహితుడు ఖంగుతిన్నాడు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో... ఏటీఎం కార్డుకు కేవైసీ అప్‌డేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేయగా... తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన మూడు డెబిట్ కార్డుల వివరాలు చెప్పాడు. క్షణాల్లో అతని అకౌంట్ నుంచి 8 వేలు కాజేశారు.

నైజీరియన్​ చేతిలో...

హైదరాబాద్‌లోని పాత బస్తీకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో ఓ నైజీరియన్‌ స్నేహం చేశాడు. కొన్ని రోజుల చాటింగ్‌ అనంతరం బహుమతులు పంపిస్తున్నానని నమ్మించాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని, రుసుములు చెల్లించాలని రూ.1.24 లక్షలు వసూలు చేశాడు. మరో రూ.2లక్షలు కావాలని బుకాయించడంతో అనుమానం వచ్చిన బాధితుడు శుక్రవారం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంస్థ ప్రతినిధులుగా..

వగరంలోని టోలిచౌకిలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న మహిళ జస్ట్‌డయల్‌ అనే యాప్‌లో ప్రకటన పోస్టు చేశారు. ఓ సైబర్‌ నేరగాడు తమకు వెయ్యి రూపాయల టిఫిన్‌లు కావాలని..ముందే యాప్‌ ద్వారా నగదు పంపిస్తామని నమ్మించాడు. ఆమెకు క్యూఆర్‌ కోడ్‌ పంపించి.. స్కాన్‌ చేయాలని చెప్పాడు. స్కాన్‌ చేసిన అనంతరం ఆమె ఖాతా నుంచి రూ.60వేలు మాయం చేశారు. సైబర్‌ నేరస్థుల చేతిలో మోసపోయామని మరో ఇద్దరు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పించినా రోజు రోజుకూ కేసులు పెరుతూనే ఉన్నాయి. ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని... ఎలాంటి అనుమానం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని చెబుతున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణ: మత్యుబావిలో 9 మృతదేహాలు... హత్యా... ఆత్మహత్యలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.