విజయవాడలో నూతన గవర్నర్ కోసం సిద్ధమవుతున్న రాజ్‌భవన్‌ను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈనెల 22వ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గవర్నర్ కార్యాలయంలోని ప్రతి గదిని క్షుణ్నంగా పరిశీలించారు. సదుపాయాల గురించి పలు సూచనలు చేశారు. సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకుండా చూడాలని చెప్పారు. ఈనెల 24న గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అతిథుల కోసం సరైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి.. ముఖ్యమంత్రి జగన్‌కు డిప్లమాటిక్ పాస్‌పోర్ట్