ETV Bharat / state

forest development : రూ.225 కోట్ల అంచనాతో అడవుల సంరక్షణకు చర్యలు : సీఎస్

author img

By

Published : Apr 17, 2023, 9:41 PM IST

forest development : అడవుల అభివృద్ధి, జంతు సంరక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అటవీ అధికారులతో సమీక్షించారు. ఆ మేరకు కాంపా నిధులతో తక్షణమే చేపట్టాల్సిన పనులపై చర్చించారు. 2022-23 సంవత్సరంలో 225 కోట్ల రూపాయల అంచనాతో అటవీ విస్తీర్ణం పెంపుదలకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.

సీఎస్ సమీక్ష సమావేశం
సీఎస్ సమీక్ష సమావేశం

forest development : ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులు, అడవుల్లో రహదారుల విస్తరణ ఫలితంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. అటవీ ప్రాంతం తగ్గిపోవడంతో వన్య మృగాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీవవైవిధ్యం దెబ్బతింటున్న పరిణామాల నేపథ్యాన అడవుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంపా నిధులతో అటవీ సంరక్షణకు చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, భూసార పరిరక్షణ, రక్షిత అటవీ ప్రాంతాల నుంచి ఆయా గ్రామాలను రీలొకేట్ చేయడంపై సమీక్ష కొనసాగింది.

అటవీ విస్తీర్ణం 23 శాతం.. రాష్ట్రంలో 38,060 చదరపు కిలో మీటర్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయని.. రాష్ట్ర వైశాల్యంలో అడవుల విస్తీర్ణం సుమారు 23శాతం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంపా కింద 2022-23 సంవత్సరంలో 225 కోట్ల రూపాయల అంచనాతో అటవీ విస్తీర్ణం పెంపుదలకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.

కాంపా నిధులతో అభివృద్ధి... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అడవులను సంరక్షించడంతో పాటు కొత్తగా అడవుల పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సీఎస్ అధ్యక్షతన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజిమెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) సమావేశం జరిగింది. రాష్ట్రంలో సుమారు 23శాతం మేర.. 38వేల 60 చదరపు కిలో మీటర్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కాంపా కింద 2022-23 సంవత్సరంలో 225 కోట్ల రూపాయల అంచనాతో అటవీ విస్తీర్ణం పెంపుదలకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.

అడవుల అభివృద్ధి లక్ష్యంగా.. పరిశ్రమలు, రిజర్వాయర్లు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, గనుల తవ్వకం, అటవీ ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణం.. ఆయా అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ భూములను వినియోగించిన ప్రాంతాల్లో పెద్దఎత్తున అడవులను చేపట్టడమే ముఖ్య లక్ష్యమని సీఎస్ స్పష్టం చేశారు. కాంపా నిధులతో అటవీ సంరక్షణతో పాటు అడవుల్లో మొక్కలకు తెగుళ్ల నివారణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అటవీ ప్రాంతాల్లో భూసార పరిరక్షణ చర్యలు చేపట్టడం, రక్షిత అటవీ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ఆయా గ్రామాలను రీలొకేట్ చేయడం, వన్యమృగ ఆవాస సంరక్షణ, వన్య మృగ కారిడార్ల పరిధిలో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం అటవీ పునరుద్ధరణ, వన్య మృగ సంరక్షణ చర్యల్లో భాగంగా జంతు సంరక్షణ, వెటర్నరీ ట్రీట్​మెంట్​ సౌకర్యాల కల్పన, మేనేజ్​మెంట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, బయోలాజికల్ రీసోర్సెస్ వంటి చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.