కృష్ణా జిల్లా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం కొవిడ్ రెండో డోస్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు వ్యాక్సిన్ కేంద్రానికి తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా వైద్య సిబ్బంది మొదటి డోసు తీసుకొని నెలరోజులు నిండిన వారికి సీరియల్ ప్రకారం టోకెన్లు ఇచ్చారు. అయినప్పటికీ పట్టణంలో టోకెన్లు పొందిన వారందరూ ఒకేసారి రావడంతో రద్దీ పెరిగింది.
మున్సిపాలిటీ వారు షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి చాలక ఎండలో కూడా నిలబడాల్సి వచ్చింది. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి, వైద్య సిబ్బందికి.... మున్సిపాలిటీ వారు కనీసం మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు చోట్ల వ్యాక్సిన్ వేసినప్పటికీ సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో వ్యాక్సిన్ వేయడం చాలా ఆలస్యమైంది.
ఇదీ చదవండి: